కేసీఆర్ పర్యటన.. TRS ఎమ్మెల్యేపై వరంగల్‌లో పాంప్లేట్స్ కలకలం

దిశ ప్రతినిధి, వరంగల్ : సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల కరపత్రాల విడుదల హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం ఉదయం కరపత్రాల రిలీజ్ వెలుగులోకి వచ్చింది. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ.. ఆగంతకులు లేఖలో ఘూటుగా పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కర పత్రాలను న్యూస్ పేపర్‌లో పెట్టి వరంగల్ తూర్పులో పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ వరంగల్ టూర్‌ను దృష్టిలో ఉంచుకొని […]

Update: 2021-06-21 02:30 GMT
kcr warangal tour Warangal Pamphlet Issue
  • whatsapp icon

దిశ ప్రతినిధి, వరంగల్ : సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల కరపత్రాల విడుదల హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం ఉదయం కరపత్రాల రిలీజ్ వెలుగులోకి వచ్చింది. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ.. ఆగంతకులు లేఖలో ఘూటుగా పేర్కొన్నారు.

Warangal-MLA-Narender

గుర్తు తెలియని వ్యక్తులు కర పత్రాలను న్యూస్ పేపర్‌లో పెట్టి వరంగల్ తూర్పులో పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ వరంగల్ టూర్‌ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ కొందరు వ్యక్తులు కరపత్రాలను పంచినట్టు తెలుస్తోంది. అయితే.. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బీ-ఫామ్స్ 50 లక్షలకు అమ్ముకున్నాడని, గతంలో ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ.. ఇలాగే డబ్బులు వసూల్ చేసాడని లేఖలో వారు పేర్కొన్నారు. వరంగల్ తూర్పులో భూకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్మెంట్స్ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఘాటుగా ఆరోపణలు చేశారు.

 

కేసీఆర్ టూర్‌లో ఎమ్మెల్యేకు ఘోర అవమానం

 

Tags:    

Similar News