బోరుబావి విషాద ఘటన: ఎమ్మెల్యే కంటతడి

దిశ, మెదక్: బోరు బావిలో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. నీళ్లు పడని బోరుబావులను తక్షణమే రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులను కోరారు. రింగ్ యజమానుల నిర్లక్ష్యంతోనే పొడ్చనపల్లిలో విషాదం చోటుచేసుకుందని ఎమ్మెల్యే పద్మ, బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రింగ్ యజమానిపై కేసు నమోదు చేయాలని […]

Update: 2020-05-28 00:04 GMT

దిశ, మెదక్: బోరు బావిలో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. నీళ్లు పడని బోరుబావులను తక్షణమే రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులను కోరారు. రింగ్ యజమానుల నిర్లక్ష్యంతోనే పొడ్చనపల్లిలో విషాదం చోటుచేసుకుందని ఎమ్మెల్యే పద్మ, బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రింగ్ యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు వాడటం లేదని వారు ఆరోపించారు.

Tags:    

Similar News