త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తాం…

దిశ, ఇబ్రహీంపట్నం: నియోజకవర్గ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి టోల్ ఫ్రీ, వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న సమయంలో ఫేస్‌బుక్ అకౌంట్‌కు ఫిర్యాదు వచ్చిందని, దాంతో ఆరోజే ప్రజా సమస్యల ఫిర్యాదు కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకునట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై, ఇళ్ల మధ్యలో నీరు నిలిచి రాకపోకలు ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు బాధను […]

Update: 2020-08-13 12:12 GMT

దిశ, ఇబ్రహీంపట్నం: నియోజకవర్గ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి టోల్ ఫ్రీ, వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న సమయంలో ఫేస్‌బుక్ అకౌంట్‌కు ఫిర్యాదు వచ్చిందని, దాంతో ఆరోజే ప్రజా సమస్యల ఫిర్యాదు కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకునట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై, ఇళ్ల మధ్యలో నీరు నిలిచి రాకపోకలు ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు బాధను వేణుగోపాల్ అనే వ్యక్తి ఫోటో, వీడియోలు తీసి తన ఫేస్‌బుక్ ద్వారా ఎమ్మెల్యేకు పోస్టు చేశారు.

దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా ఏ సమస్య ఉన్నా, తన దృష్టికి తీసుకొస్తే, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. టీఆర్‌ఎస్ యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి (బంటి) త్వరలో వాట్సాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి నియోజకవర్గంలో టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Tags:    

Similar News