‘ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ దొంగలను తయారు చేస్తున్నారు’

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ ను అక్రమాలకు అడ్డాగా మార్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజీనామా చేయాలని, దానికి సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను  వెంటనే సస్పెండ్ చేయాలని ఆర్మూర్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి 63 పక్కన అక్రమంగా నిర్మించిన భవనం ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. సంబంధిత అధికారుల స్పందన లేని కారణంగా జాతీయ రహదారి 63 పై సంబంధిత అధికారులను సస్పెండ్ […]

Update: 2021-07-29 04:59 GMT

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ ను అక్రమాలకు అడ్డాగా మార్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజీనామా చేయాలని, దానికి సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆర్మూర్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి 63 పక్కన అక్రమంగా నిర్మించిన భవనం ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. సంబంధిత అధికారుల స్పందన లేని కారణంగా జాతీయ రహదారి 63 పై సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, కలెక్టర్ ను సైతం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నో సార్లు శాంతియుతంగా ఎంఆర్వో, ఆర్డీవోలతో పాటు పై అధికారులకు, జిల్లా కలెక్టర్ కు మెమోరాండంలు సమర్పించామని తెలిపారు.

కబ్జాలకు గురవుతున్న భూములను పరిరక్షించాలని విన్నవించినా.. నిమ్మకు నీరెత్తినట్లు గా స్పందించకుండా అక్రమంగా జరుగుతున్న నిర్మాణాలను పట్టించుకోవడం లేదన్నారు. సంబంధిత అధికారులు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లు అక్రమార్కుల దగ్గర ఎన్ని కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని ప్రశ్నించారు. పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించలేని మీరు భూములను అక్రమంగా ఆక్రమించుకునే వారిని ప్రోత్సహిస్తూ భూ దొంగలను తయారు చేస్తున్నారని, ఆక్రమణకు గురైనటువంటి భూములను, ప్రభుత్వ భూములను, అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని లేదా కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూరు మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గివిజయ్, నిజామాబాద్ పార్లమెంట్ దళిత మోర్చా కన్వీనర్ నల్ల రాజారాం, సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, భారతీయ జనతా దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News