ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయకుంటే 30న దీక్ష: జగ్గారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతాంగాన్ని సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామంటున్నారని మండిపడ్డారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 30న దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కరోనా దెబ్బతో ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టలేరని, నామమాత్రపు ఫీజుతో ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతాంగాన్ని సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామంటున్నారని మండిపడ్డారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 30న దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కరోనా దెబ్బతో ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టలేరని, నామమాత్రపు ఫీజుతో ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నియంత్రిత సాగు విషయంలో కేసీఆర్ మొదటి నుంచి మొండిగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సన్నాలు వేయాలని చెప్పారని, దాని వల్ల పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గిపోయి రైతులు చాలా నష్టపోయారని, సన్నాలు పండించిన రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. రైతులకు సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామంటున్నారని, రూ.7500 కోట్లు నష్టమంటున్నారని, రైతుల విషయంలో ప్రభుత్వం ఇలా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు.