‘వాళ్లు అలా చేస్తే.. నా కూతురును రాజకీయాల్లోకి దించుతా’
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ పదవి నుంచి నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగించాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తమ్‌ను కొనసాగించేలా రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని తెలిపారు. పీసీసీ పదవి కోసం మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని, రేవంత్‌కు పీసీసీ ఇస్తే అభ్యంతరం చెబుతానని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ […]
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ పదవి నుంచి నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగించాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తమ్‌ను కొనసాగించేలా రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని తెలిపారు. పీసీసీ పదవి కోసం మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని, రేవంత్‌కు పీసీసీ ఇస్తే అభ్యంతరం చెబుతానని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ తనను సంప్రదించకుండా రేవంత్‌కు పీసీసీ ఇస్తే, పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా వెనకాడబోనని జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని 20 నియోజకవర్గాల్లో గెలిపిస్తానన్న రేవంత్, సొంత నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి కోవర్టులు ఎక్కువగా ఉన్నారని, వారు పీసీసీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, ఫయీమ్‌లు అని, వారంతా కుంతియా చుట్టే తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చేస్తే.. తన కూతురును రాజకీయాల్లోకి దించుతా అని స్పష్టం చేశారు.