రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆడియో లీక్

దిశ, జనగామ: హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గువ్వల బాలరాజుకు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. వరుసగా ఫోన్లు చేసి.. సార్ మీరెప్పుడు రాజీనామా చేస్తారని అడుగుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆదివారం జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత కూడా ఫోన్ చేశారు. ‘హలో సార్ నేను జనగామ జిల్లా బీజేపీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను.. […]

Update: 2021-11-07 04:22 GMT

దిశ, జనగామ: హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గువ్వల బాలరాజుకు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. వరుసగా ఫోన్లు చేసి.. సార్ మీరెప్పుడు రాజీనామా చేస్తారని అడుగుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆదివారం జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత కూడా ఫోన్ చేశారు. ‘హలో సార్ నేను జనగామ జిల్లా బీజేపీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను.. హుజరాబాద్‌లో బీజేపీ గెలిచి నాలుగు రోజులవుతుంది. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు..?’ అని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అడుగగా,.. ‘చేస్తా.. చేస్తా’ అంటూ బాలరాజు ఫోన్ కట్ చేశారు. అందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags:    

Similar News