లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంచొద్దు: గణేశ్ గుప్తా
దిశ, నిజామబాద్: కార్పొరేటర్లు, స్థానిక నేతలతో అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా శనివారం సమావేశం అయ్యారు. వర్షాకలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా కార్పొరేటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు, ఈగల ద్వారా కలరా, టైఫాయిడ్, మలేరియా ప్రబలే అవకాశం […]
దిశ, నిజామబాద్: కార్పొరేటర్లు, స్థానిక నేతలతో అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా శనివారం సమావేశం అయ్యారు. వర్షాకలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా కార్పొరేటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు, ఈగల ద్వారా కలరా, టైఫాయిడ్, మలేరియా ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటి ఆవరణలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.