పంజాబ్ కు ఓ నీతి! తెలంగాణకు ఒక నీతా?.. ఎమ్మెల్యే గండ్ర

దిశ, భూపాలపల్లి: ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్ కి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతిలా వ్యవహరించడం సరి కాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని లక్ష్మారెడ్డి పాలెం, ధర్మ రావు పేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి […]

Update: 2021-11-30 05:27 GMT

దిశ, భూపాలపల్లి: ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్ కి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతిలా వ్యవహరించడం సరి కాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని లక్ష్మారెడ్డి పాలెం, ధర్మ రావు పేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో ఉన్న వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎందుకు వివక్ష చూపుతోందని సూటిగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధాన్యం కొనుగోలు విషయంలో పునరాలోచించి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Tags:    

Similar News