బీజేపీకి రైతులే బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
దిశ, సూర్యాపేట: బీజేపీకి రైతులే బుద్ధి చెబుతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం సూర్యాపేట మండలం పరిధిలోని మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రైతాంగం కోసం కేసీఆర్ గడిచిన ఏడేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంటు, నీళ్లు, రైతు బంధు, రైతు బీమా వంటి గొప్ప పథకాలను తీసుకొచ్చారన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం […]
దిశ, సూర్యాపేట: బీజేపీకి రైతులే బుద్ధి చెబుతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం సూర్యాపేట మండలం పరిధిలోని మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రైతాంగం కోసం కేసీఆర్ గడిచిన ఏడేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంటు, నీళ్లు, రైతు బంధు, రైతు బీమా వంటి గొప్ప పథకాలను తీసుకొచ్చారన్నారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. కేంద్రం వైఖరిని నిలదీస్తూ.. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 20న బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులెత్తేయడంతో… వరికి బదులుగా రైతులు ఇతర పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల ఎoపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడీ భిక్షo, రైతు సమన్వయ సమితి కక్కిరేణి నాగయ్య గౌడ్, యు.కె పల్లి మండలం ఎంపీపీ, జడ్పీటీసీ, తదితరులు పాల్గొన్నారు.