ప్రసంగంలో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

దిశ, చార్మినార్: నిరక్ష్యరాస్యులైన ముస్లింలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే సాలారే మిల్లత్ ట్రస్ట్​లక్ష్యమని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. తనపై గతంలో జరిగిన హత్యాయత్నంలో విషమ పరిస్థితుల్లో ఉన్నపుడు పేద ప్రజల ప్రార్థనలే తనకు పునర్జన్మనిచ్చాయన్నారు. నాకు ఈ లీడర్ గిరి, ఎమ్మెల్యే పదవిపై ఎలాంటి మక్కువ లేదని, నాలో ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసుకుంటానన్నారు. ఉద్వేగ పూరితంగా సాగిన తన ప్రసంగంలో అక్బరుద్దీన్ ఓవైసీ కంటతడి పెట్టారు. శనివారం బండ్లగూడలోని కేజీ […]

Update: 2021-11-20 10:56 GMT

దిశ, చార్మినార్: నిరక్ష్యరాస్యులైన ముస్లింలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే సాలారే మిల్లత్ ట్రస్ట్​లక్ష్యమని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. తనపై గతంలో జరిగిన హత్యాయత్నంలో విషమ పరిస్థితుల్లో ఉన్నపుడు పేద ప్రజల ప్రార్థనలే తనకు పునర్జన్మనిచ్చాయన్నారు. నాకు ఈ లీడర్ గిరి, ఎమ్మెల్యే పదవిపై ఎలాంటి మక్కువ లేదని, నాలో ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసుకుంటానన్నారు. ఉద్వేగ పూరితంగా సాగిన తన ప్రసంగంలో అక్బరుద్దీన్ ఓవైసీ కంటతడి పెట్టారు. శనివారం బండ్లగూడలోని కేజీ టు పీజీ సెంటర్‌లో అక్బరుద్దీన్​ఓవైసీ చేతుల మీదుగా పాతబస్తీలోని 57 పాఠశాలలకు చెందిన 310 మంది ప్రైవేట్ టీచర్లకు రూ.2000 నగదుతో పాటు నిత్యావసర సరుకుల కిట్‌లను అందజేశారు. ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ తప్పనిసరి అని అన్నారు.

సాలారే మిల్లత్​ట్రస్ట్​ఆధ్వర్యంలో పేదలకు విద్య అందించాలన్న సదుద్దేశ్యంతో పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఓవైసీ ఎక్స్‌లెన్స్ స్కూల్స్ నిర్మించి పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఆ స్థలాల్లో వ్యాపార సమూదాయాలను నిర్మించి డబ్బులు సంపాదించుకోవడానికి మాకు అవకాశం ఉంది, కానీ పాతబస్తీ పేదలకు నాణ్యమైన విద్య అందించడం కోసమే పాఠశాలలను స్థాపించడం జరిగిందన్నారు. సాలరే మిల్లత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. పాతబస్తీ యువకుల స్వయం ఉపాధి కోసం న్యాక్ సంస్థను నెలకొల్పామని, యువత ఇక్కడ శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమ శిక్షణ కూడా నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

తన సొంత డబ్బులతో లాక్‌డౌన్ నుంచి ఇప్పటివరకు సుమారు రూ.12 కోట్లు పేదల కోసం అందించామన్నారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు లక్ష నిత్యావసర కిట్‌లతో పాటు ఒక లక్ష ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. 250 మంది అరబిక్ మదర్స్ హఫెజ్‌లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. లాక్‌డౌన్‌లో కొవిడ్ రోగుల ఆక్సిజన్ కోసం రూ.50 లక్షలు ఖర్చు చేశానన్నారు. గతేడాది హఫీజ్ బాబా నగర్ వరద బాధితులకు రూ.30 లక్షల విలువ చేసే కిట్‌లు, 800 వాషింగ్ మెషిన్‌లు, 500 ఫ్రిజ్‌లు మరమ్మతులు చేయించామన్నారు. ఈ సమావేశంలో సాలారే మిల్లత్ ట్రస్ట్ డైరెక్టర్​నసీర్​గయాస్, కార్పొరేటర్లు సలీంబేగ్, ఆజం షరీఫ్, అబ్దుల్​రహమాన్, ఫహద్​బిన్ అబ్దాద్, అబ్దుల్ వహబ్, అబ్దుల్ రహమాన్ షా, హఫీజ్ పటేల్, మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాద్ పాల్గొన్నారు.

Tags:    

Similar News