పైప్ లైన్ బ్లాస్ట్.. ఫౌంటెన్‌ను తలపిస్తున్న మిషన్ భగీరథ వాటర్

దిశ, పిట్లం : జుక్కల్ నియోజకవర్గం.. నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావు‌పల్లి చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో 55 మీటర్ల ఎత్తు వరకు భగీరథ నీరు ఎగిసిపడింది. ఈ నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు వెంటనే పిట్లం, నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇటీవలే ఆ మార్గంలో జాతీయ రహదారి వేసిన కారణంగా పైప్ లైన్ పగిలిపోయినట్టు సమాచారం. భారీగా త్రాగు నీరు వృథా […]

Update: 2021-08-30 08:46 GMT

దిశ, పిట్లం : జుక్కల్ నియోజకవర్గం.. నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావు‌పల్లి చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో 55 మీటర్ల ఎత్తు వరకు భగీరథ నీరు ఎగిసిపడింది. ఈ నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో స్థానికులు వెంటనే పిట్లం, నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇటీవలే ఆ మార్గంలో జాతీయ రహదారి వేసిన కారణంగా పైప్ లైన్ పగిలిపోయినట్టు సమాచారం. భారీగా త్రాగు నీరు వృథా అవుతున్న కారణంగా అధికారులు స్పందించి నీటి ప్రవాహాన్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News