మిషన్ భగీరథ పైపుల్లో నీళ్లు కాదు.. మంటలు ఎగిసిపడ్డాయి..!

దిశ, అచ్చంపేట: తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ (ఇంటింటికి తాగు నీరు)పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశంసలతో పాటు పలు సార్లు ప్రభుత్వం విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం ఇంద్రానగర్‌లో మిషన్ భగీరథ పైపులను ఖాళీ స్థలంలో ఉంచారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం పైపుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైపులు పూర్తిగా కాలిపోయి దట్టమైన […]

Update: 2021-03-31 07:50 GMT

దిశ, అచ్చంపేట: తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ (ఇంటింటికి తాగు నీరు)పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశంసలతో పాటు పలు సార్లు ప్రభుత్వం విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం ఇంద్రానగర్‌లో మిషన్ భగీరథ పైపులను ఖాళీ స్థలంలో ఉంచారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం పైపుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైపులు పూర్తిగా కాలిపోయి దట్టమైన పోగతో పాటు మంటల వ్యాప్తి అధికం అయింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.

Tags:    

Similar News