ఆస్పత్రికి వెళ్లిన యువతి మిస్సింగ్

దిశ,భువనగిరి రూరల్ : ఆస్పత్రికి వెళ్లొస్తానని వెళ్లిన యువతి మళ్లీ తిరిగి రాలేదు. అనారోగ్యంగా ఉందని 8 నెలల చిన్నారితో వెళ్లిన ఆమె ఒకరోజు గడిచినా ఆచూకీ లేకుండా పోయింది. యాదాద్రి జిల్లా వలిగొండ ఎస్సై రాఘవేంద్ర గౌడ్ కథనం ప్రకారం.. వలిగొండ మండలం సంగం గ్రామానికి చెందిన బసంపల్లి నందిని (20) బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంగా ఉందని, ఆస్పత్రికని చెప్పి చౌటుప్పల్ వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లిన ఆమె సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు […]

Update: 2021-07-08 11:37 GMT

దిశ,భువనగిరి రూరల్ : ఆస్పత్రికి వెళ్లొస్తానని వెళ్లిన యువతి మళ్లీ తిరిగి రాలేదు. అనారోగ్యంగా ఉందని 8 నెలల చిన్నారితో వెళ్లిన ఆమె ఒకరోజు గడిచినా ఆచూకీ లేకుండా పోయింది. యాదాద్రి జిల్లా వలిగొండ ఎస్సై రాఘవేంద్ర గౌడ్ కథనం ప్రకారం.. వలిగొండ మండలం సంగం గ్రామానికి చెందిన బసంపల్లి నందిని (20) బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంగా ఉందని, ఆస్పత్రికని చెప్పి చౌటుప్పల్ వెళ్లింది.

ఆస్పత్రికి వెళ్లిన ఆమె సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, మిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం వలిగొండ పోలీస్ స్టేషన్ లో ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. నందిని వెంట 8 నెలల చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఎస్సై రాఘవేంద్ర గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News