ఖమ్మంపై మంత్రులు కేటీఆర్, అజయ్ రివ్యూ
దిశ, న్యూస్‌బ్యూరో: ఖమ్మం మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని, రాబోయే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఖమ్మం మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని, రాబోయే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. నగరాభివృద్ది కోసం చేపట్టిన చర్యలపై రవాణా మంత్రి అజయ్ కుమార్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక నివేదిక అందించారు. మిషన్ భగీరథ పనులపై సైతం ఇరువురు మంత్రులు చర్చించుకున్నారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అరవింద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ అనురాగ్ జయంతి, ఖమ్మం కలెక్టర్ ఆర్.వి కర్ణన్ సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.