మంత్రి వేములకు షాక్ ఇచ్చిన BJYM నాయకులు

దిశ, కామారెడ్డి : రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బీజేవైఎం నాయకులు షాక్ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధారి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తిరిగి వెళ్తున్న మంత్రి కాన్వాయిను బీజేవైఎం నాయకులు అడ్డగించారు. కేసీఆర్ డౌన్ డౌన్.. గోబ్యాక్ మంత్రి అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొట్లాడి […]

Update: 2021-07-05 07:47 GMT

దిశ, కామారెడ్డి : రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బీజేవైఎం నాయకులు షాక్ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధారి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తిరిగి వెళ్తున్న మంత్రి కాన్వాయిను బీజేవైఎం నాయకులు అడ్డగించారు. కేసీఆర్ డౌన్ డౌన్.. గోబ్యాక్ మంత్రి అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న రాష్టంలో ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య అలాగే ఉందన్నారు.

రాష్టంలోని విద్యార్థులకు ఉద్యోగాలు రాక రోడ్ల మీద పడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇకనైనా రాష్ట ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఇప్పటివరకు చెల్లించాల్సిన 93,496 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్యగౌడ్, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, సాయికిరణ్, ఉపాధ్యక్షుడు మన్నె క్రిష్ణ, రమేష్ రెడ్డి, రాజేంధర్, ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News