మధురైని రెండో కేపిటల్ చేయాలి

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన మంత్రి ఉదయ్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. తమిళనాడుకు రెండో రాజధానిగా మధురైని తక్షణమే ప్రకటించాలని తీర్మానం చేశారు. ఆదివారం దక్షిణ తమిళనాడుకు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన మంత్రి ఉదయ్ మాట్లాడుతూ.. చెన్నై నగరంలో విపరీతమైన రద్దీ పెరగడంతో పాటు, వరదలు పోటెత్తుతున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి రెండో రాజధాని అత్యవసరం అని వ్యాఖ్యానించారు. స్టేట్ డెవలప్ కావాలంటే మధురైని రెండో రాజధానిగా చేయాల్సిందేనని […]

Update: 2020-08-16 06:45 GMT
మధురైని రెండో కేపిటల్ చేయాలి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన మంత్రి ఉదయ్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. తమిళనాడుకు రెండో రాజధానిగా మధురైని తక్షణమే ప్రకటించాలని తీర్మానం చేశారు. ఆదివారం దక్షిణ తమిళనాడుకు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన మంత్రి ఉదయ్ మాట్లాడుతూ.. చెన్నై నగరంలో విపరీతమైన రద్దీ పెరగడంతో పాటు, వరదలు పోటెత్తుతున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి రెండో రాజధాని అత్యవసరం అని వ్యాఖ్యానించారు. స్టేట్ డెవలప్ కావాలంటే మధురైని రెండో రాజధానిగా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో మంత్రి ఉదయ్ కుమార్‌కు పూర్తి మద్దతు తెలిపిన పలువురు ముఖ్య నేతలు తీర్మానం చేశారు.

Tags:    

Similar News