సనత్‌నగర్‌లో తలసానికి సన్మానం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పేదల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన మహిళలు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించడం పట్ల మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పేదల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన మహిళలు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించడం పట్ల మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పేదలకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు ఆర్థికసాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.