ఊహించని రీతిలో ఫిట్‌మెంట్ : మంత్రి తలసాని
దిశ,తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ఉద్యోగుల కృషి ఎనలేనిదని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం జలమండలి అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం, మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూల ధోరణితో ఉందని తెలియజేశారు. ఎవరూ ఊహించని రీతిలో ఫిట్మెంట్ ఇస్తామని ఇప్పటికే […]
దిశ,తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ఉద్యోగుల కృషి ఎనలేనిదని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం జలమండలి అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం, మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూల ధోరణితో ఉందని తెలియజేశారు.
ఎవరూ ఊహించని రీతిలో ఫిట్మెంట్ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలను చేస్తూ అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ నెల14వ తేదీన జరిగే MLC ఎన్నికలలో శ్రీమతి సురభి వాణిదేవికి ఓటేసి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆయా సంఘాలకు చెందిన సత్యనారాయణ, హరిశంకర్, మమత, కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ మోహన్, కిషన్, శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.