పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : తలసాని
దిశ, ముషీరాబాద్: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్‌లోని ముగ్గు బస్తీలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలసి పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… కరోనా విపత్కర పరిస్థితుల్లో మహమ్మారి సోకకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా యావత్ మానవాళి కరోనాతో పోరాడుతున్న తరుణంలో కొందరు రాజకీయ లబ్ది కోసం దుష్ప్రచారం చేస్తున్నారని, […]
దిశ, ముషీరాబాద్: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్‌లోని ముగ్గు బస్తీలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలసి పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… కరోనా విపత్కర పరిస్థితుల్లో మహమ్మారి సోకకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా యావత్ మానవాళి కరోనాతో పోరాడుతున్న తరుణంలో కొందరు రాజకీయ లబ్ది కోసం దుష్ప్రచారం చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న వైద్య పరమైన చర్యలు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు.కాలుష్య నివారణకు మానవ మనుగడకు, రాజకీయాలకతీతంగా అందరూ హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, తదితర అధికారులతో కలిసి మొక్కలు నాటారు.