పోటీ నుంచి తప్పుకునేందుకే కాంగ్రెస్ నాటకం !
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మంత్రి తలసాని ఎద్దెవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునేందుకే ఆ పార్టీ రిజర్వేషన్లను సాకుగా చూపుతుందని గురువారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బీసీలకు 50శాతం సీట్లు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, 70ఏళ్లలో బీసీలు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మంత్రి తలసాని ఎద్దెవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునేందుకే ఆ పార్టీ రిజర్వేషన్లను సాకుగా చూపుతుందని గురువారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బీసీలకు 50శాతం సీట్లు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, 70ఏళ్లలో బీసీలు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. అసెంబ్లీ తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీకి బీసీలు గుర్తుకు వస్తారని, బీసీలకు న్యాయం చేయడం లేదని గాంధీ భవన్‌లో జరిగిన ఎన్నో కొట్లాటలు రాష్ర్ట ప్రజలందరూ చూశారని మండిపడ్డారు. వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌కు కేంద్రం ఇప్పటికీ చేసిందేమీ లేదని, నరేంద్ర మోడీ బీహార్‌కే ప్రధానిగా అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.