ఉజ్జయిని మహంకాళి బోనాలు..
దిశ, హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగకు కరోనా మహమ్మారి బ్రేక్ వేసింది. డోలు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల మధ్య భక్తులు ప్రతియేడు అమ్మవార్లకు బోనాలు సమర్పించేవారు. కానీ, ఈసారి అవేవి లేకుండా సింపుల్‌గా కేవలం ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఈ మేరకు మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవ ఏర్పాట్లను ఆయన […]
దిశ, హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగకు కరోనా మహమ్మారి బ్రేక్ వేసింది. డోలు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల మధ్య భక్తులు ప్రతియేడు అమ్మవార్లకు బోనాలు సమర్పించేవారు. కానీ, ఈసారి అవేవి లేకుండా సింపుల్‌గా కేవలం ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఈ మేరకు మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలు దేశంలోనే అతి పెద్ద పండుగ అని వివరించారు. బోనాల పండుగ వచ్చిందంటే ప్రతి ఇల్లు బంధువులు, సన్నిహితుల రాకతో ఎంతో సందడిగా మారుతుందని చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థలు అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. అయితే, ఈ ఏడాది మాయదారి కరోనా వలన ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భక్తులు లేకుండా బోనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భక్తులు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఏసీపీ వినోద్ పాల్గొన్నారు.