‘దుర్మార్గంతోనే వరద సాయాన్ని ఆపారు’

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని దుర్మార్గమైన ఆలోచనతోనే నిలిచిపోయేలా చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేపథ్యంలో వరద సాయాన్ని నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై స్పందించిన మంత్రి తలసాని.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వరద సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పెద్ద మనస్సుతో సీఎం కేసీఆర్ సాయం చేస్తుంటే కొన్ని […]

Update: 2020-11-18 08:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని దుర్మార్గమైన ఆలోచనతోనే నిలిచిపోయేలా చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేపథ్యంలో వరద సాయాన్ని నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై స్పందించిన మంత్రి తలసాని.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వరద సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పెద్ద మనస్సుతో సీఎం కేసీఆర్ సాయం చేస్తుంటే కొన్ని రాజకీయ పక్షాలు దుర్మార్గపు ఆలోచన చేశారని ఆయన ఆరోపించారు.

అలాగే, దుబ్బాక రఘునందన్‌ గెలుపు పై కూడా స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్క సీటును గెలిచి ప్రపంచాన్ని జయించామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను కావాలని రెచ్చగొడుతున్నారని.. కానీ, ఇక్కడ ఎవరూ రెచ్చిపోరన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉందన్న తలసాని మేయర్ పీఠం కోసం మా ఇంటి నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News