హుజురాబాద్ బై పోల్స్‌లో విచిత్రం : టీఆర్ఎస్ శ్రేణులకు అంతుచిక్కని ‘ఓ నేత’

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై ఎలక్షన్స్‌లో ఓ నాయకుడి చేష్టలపై ప్రస్తుతం ప్రధానంగా చర్చ సాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లోనూ దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కీలక మంత్రికి సన్నిహితుడిగా ఉన్న ఆ నాయకుడు తనకు సంబంధం లేకున్నా హుజురాబాద్‌లో పర్యటిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారట. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు, రెండు మునిసిపాలిటీలకు ఇంచార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బాధ్యతలు అప్పగించిన జాబితాలో ఆ ప్రజాప్రతినిధి పేరు […]

Update: 2021-07-24 08:27 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై ఎలక్షన్స్‌లో ఓ నాయకుడి చేష్టలపై ప్రస్తుతం ప్రధానంగా చర్చ సాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లోనూ దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కీలక మంత్రికి సన్నిహితుడిగా ఉన్న ఆ నాయకుడు తనకు సంబంధం లేకున్నా హుజురాబాద్‌లో పర్యటిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారట. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు, రెండు మునిసిపాలిటీలకు ఇంచార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బాధ్యతలు అప్పగించిన జాబితాలో ఆ ప్రజాప్రతినిధి పేరు లేకున్నా హుజురాబాద్‌లోనే పర్యటిస్తూ స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటున్నారని పార్టీలోని ముఖ్య నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారని సమాచారం.

అధిష్టానం పెద్దలకు సన్నిహితుడైన సదరు నాయకుడు తన పర్యటన ఉందని స్థానిక నాయకులకు చెప్తుండటంతో ఆయన కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కొందరు ముఖ్య నాయకులు మాత్రం ఆయనకు ఫలానా ఇంచార్జీ పదవి ఇవ్వకపోయినా.. తప్పని పరిస్థితుల్లో సదరు నేత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధిష్టానం పెద్దలను ఈ విషయం గురించి అడిగితే వారేలా స్పందిస్తారో తెలియక ఇక్కడి నేతలు నిమ్మకుండి పోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై రాష్ట్రస్థాయి నాయకుల్లోనూ అంతర్మథనం మొదలైనట్టుగా సమాచారం. హుజురాబాద్‌లో తిరుగడమే కాకుండా ప్రెస్‌మీట్లు పెడుతూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేత తీరుపై ఇప్పటికే కొంతమంది గులాబీ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:    

Similar News