సినారె సేవలకు గుర్తుగా ఆడిటోరియ నిర్మాణం

దిశ, న్యూస్‌బ్యూరో: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, సి. నారాయణ‌రెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆడిటోరియ నిర్మాణం చేపడుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో కవులు, రచయితలు, కళాకారులకు గౌరవం దక్కిందన్నారు. ఈనెల 29న సినారె 89వ జయంతిని పురస్కరించుకుని వారి పేరిట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో నూతనంగా నిర్మించనున్న డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం) శంకుస్థాపన కార్యక్రమం ముందస్తు ఏర్పాటును ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో […]

Update: 2020-07-27 08:21 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, సి. నారాయణ‌రెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆడిటోరియ నిర్మాణం చేపడుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో కవులు, రచయితలు, కళాకారులకు గౌరవం దక్కిందన్నారు. ఈనెల 29న సినారె 89వ జయంతిని పురస్కరించుకుని వారి పేరిట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో నూతనంగా నిర్మించనున్న డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం) శంకుస్థాపన కార్యక్రమం ముందస్తు ఏర్పాటును ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలసి సోమవారం మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితివేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహిత సి. నారాయణ‌రెడ్డి అని మంత్రి కొనియాడారు. సినారె సేవలకు గుర్తుగా ఆధునిక హంగులతో గొప్ప ఆడిటోరియంను హైదరాబాద్ నగరంలో నిర్మించటానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దానిని అనుసరించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో బంజారాహిల్స్‌లో 3050 గజాల ప్రభుత్వ భూమిని కేటాయించారన్నారు. సినారె జయంతి సందర్భంగా ఆడిటోరియం శంకుస్థాపన చేయనుట్టు తెలిపారు.

Tags:    

Similar News