మంత్రి చెప్తే వినరా.? ఆ శాఖలో ఏం జరుగుతోంది?

దిశ, తెలంగాణ బ్యూరో: ఆబ్కారీ శాఖలో మంత్రి, అధికారుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పలు అంశాల్లో మంత్రి శ్రీనివాస్​గౌడ్​.. ఉన్నతాధికారులపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్సైజ్​ శాఖలో చెక్కుల అంశం, బదిలీలు, పదోన్నతుల విషయంలో సీఎస్​పై అధిష్టానానికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. చెక్కుల రూపంలో మద్యం సరఫరాకు ఎలాంటి అనుమతులు లేకుండా స్వీకరించడంపై అధికారుల్లో వివాదం తలెత్తింది. బేవరేజెస్​ కార్పొరేషన్​ నుంచి క్యాష్​ అండ్​ క్యారీ పద్దతిలోనే లిక్కర్​ సరఫరా చేస్తుండగా.. కొత్తగా […]

Update: 2020-12-07 01:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆబ్కారీ శాఖలో మంత్రి, అధికారుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పలు అంశాల్లో మంత్రి శ్రీనివాస్​గౌడ్​.. ఉన్నతాధికారులపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్సైజ్​ శాఖలో చెక్కుల అంశం, బదిలీలు, పదోన్నతుల విషయంలో సీఎస్​పై అధిష్టానానికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. చెక్కుల రూపంలో మద్యం సరఫరాకు ఎలాంటి అనుమతులు లేకుండా స్వీకరించడంపై అధికారుల్లో వివాదం తలెత్తింది. బేవరేజెస్​ కార్పొరేషన్​ నుంచి క్యాష్​ అండ్​ క్యారీ పద్దతిలోనే లిక్కర్​ సరఫరా చేస్తుండగా.. కొత్తగా చెక్కులు, ఆన్​లైన్​ పేమెంట్​ను ప్రవేశపెట్టారు. ఈ పద్దతిని కనీసం మంత్రికి కూడా తెలియకుండానే నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంత్రి సీరియస్​ అయ్యారు.

చెక్కులేంది మరి..?

ఎక్సైజ్​ శాఖలో కొత్తగా చెక్కుల వ్యవహారం మొదలైంది. గత నెల 29 నుంచి డిసెంబర్​ 1 వరకు వరుసగా సెలవు దినాలు కావడంతో చెక్కులిచ్చినా మద్యం సరఫరా చేస్తామంటూ బేవరేజెస్​ కార్పొరేషన్‌ అధికారులు అదే నెల 28న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 268 కోట్ల విలువైన లిక్కర్​ను తీసుకున్నారు. దీనిలో రూ.112 కోట్లకు చెక్కులిచ్చారు. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో డిసెంబరు 3 వరకు, జిల్లాల్లో రెండో తేదీలోగా చెక్కులు క్లియర్‌ కావాల్సిందేనంటూ కార్పొరేషన్‌ నిబంధన పెట్టింది. కానీ, సోమవారం ఉదయం వరకు కేవలం రూ. 82 కోట్ల చెక్కులు మాత్రమే క్లియర్‌ అయ్యాయి. ఇంకా మిగిలిన చెక్కులు కార్పొరేషన్​కు రాలేదు.

నిజానికి చెక్కులు స్వీకరించడం కార్పొరేషన్‌లో కొత్త సాంప్రదాయం. గతంలో ఇలాంటి పద్ధతి ఎప్పుడూ లేదు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నగదు పద్ధతిలోనే లిక్కర్​ పంపిణీ చేస్తోంది. చలానా రూపంలో ముందుగా చెల్లిస్తేనే మద్యం సరఫరా చేస్తున్నారు. కానీ చెక్కులు, ఆన్​లైన్​ పేమెంట్​ను అసలే పరిగణలోకి తీసుకోరు. కానీ అధికారులు అత్యూత్సాహంతో చెక్కుల పద్దతిని తీసుకువచ్చారు. ప్రభుత్వానికి చెల్లింపుల విషయంలో ఎందుకు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే కనీసం మంత్రికి కూడా ఈ విషయం తెలియకుండా చెక్కులు తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఇప్పుడు విచారణ మొదలైంది.

ఏండ్ల నుంచి ఎదురుచూపులు

ఎక్సైజ్​ శాఖలో పలువురు అధికారులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది అధికారులు దాదాపు ఐదేళ్లుగా బదిలీల కోసం వెయిటింగ్​లో ఉన్నారు. ఇటీవల ఎక్సైజ్​ శాఖ మార్పుల్లో భాగంగా కొత్త వారి నియామకం, బదిలీలపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేషీ నుంచి ఆర్డర్లు కూడా వచ్చాయి. కానీ అవి ఇంకా సీఎస్​ పేషీ దాటలేదు. కారణాలు చెప్పకుండానే వాటిని పెండింగ్​లో పెట్టారు. మరోవైపు ఎక్సైజ్​ శాఖకు చెందిన చాలా మంది ఉద్యోగ సంఘాల్లో కీలకంగా ఉన్నారు. గతంలో అసోసియేషన్​, ఉద్యమం తదితర కారణాలతో మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు అండగా ఉంటూ ఇప్పటి దాకా వారు లూఫ్​లైన్​ పోస్టుల్లో కొనసాగుతూ వస్తున్నారు. వారందరికీ మంచి పోస్టింగ్​లు ఇప్పించేందుకు మంత్రి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఇతర విభాగాల్లో యూనియన్​ నేతలకు పదోన్నతులు, బదిలీలు ఇప్పించినా… తన సొంత శాఖలో మాత్రం మంత్రి విఫలమవుతున్నారు.

మంత్రి సీరియస్​..

ఆబ్కారీ శాఖలో వ్యవహారాలపై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సైతం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తనకు తెలియకుండానే చాలా అంశాల్లో సీఎస్​ నిర్ణయం తీసుకోవడం, చాలా ఫైళ్లు పెండింగ్​లో పెడుతుండటంపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సీఎస్​ దగ్గర ఏం చేసేది లేకపోవడంతో సైలెంట్‌గా ఉన్నారు. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్​… సీఎస్​పై ఆగ్రహంగా ఉన్నాడనే సమాచారంతో ఆబ్కారీ శాఖ వ్యవహరాలపై మంత్రి కూడా సీఎంకు ఫిర్యాదు చేశారు. కనీసం మంత్రికి తెలియకుండా తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ ఆదాయానికి గండి వంటి అంశాలను సమగ్రంగా వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆబ్కారీ శాఖతో పాటుగా అధికార వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది.

Tags:    

Similar News