బిజీబిజీగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన
దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో మంగళవారం పలు కార్యక్రమాలతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజీబిజీగా గడిపారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంను ప్రారంభించారు. మహబూబ్‌నగర్- జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగిస్తున్న కలెక్టరేట్ ప్రహరీని కలెక్టర్ వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ సురేందర్‌తో కలిసి పరిశీలించారు. మహబూబ్‌నగర్‌లోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి వచ్చే వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను […]
దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో మంగళవారం పలు కార్యక్రమాలతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజీబిజీగా గడిపారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంను ప్రారంభించారు. మహబూబ్‌నగర్- జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగిస్తున్న కలెక్టరేట్ ప్రహరీని కలెక్టర్ వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ సురేందర్‌తో కలిసి పరిశీలించారు. మహబూబ్‌నగర్‌లోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి వచ్చే వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను ప్రారంభించారు. ఆస్పత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన భోజన సౌకర్యాన్ని పరిశీలించారు.
అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకటరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
Tags: minister srinivas goud, corona, full busy, review on pending work