చదువుకుంటేనే ఉన్నత ఉద్యోగాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్‌నగర్: చదువుకోకపోవడం, అవగాహన లోపం కారణంగా కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారని.. అలా కాకుండా చదువుకుంటే ఉన్నత ఉద్యోగాలతో పాటు, సమాజంలో గౌరవంగా బతికేందుకు అవకాశం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం.. ప్రధానమంత్రి తీసుకొచ్చిన నూతన 15 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మైనార్టీలలో ఉన్న బీదరికం […]
దిశ, మహబూబ్‌నగర్: చదువుకోకపోవడం, అవగాహన లోపం కారణంగా కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారని.. అలా కాకుండా చదువుకుంటే ఉన్నత ఉద్యోగాలతో పాటు, సమాజంలో గౌరవంగా బతికేందుకు అవకాశం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం.. ప్రధానమంత్రి తీసుకొచ్చిన నూతన 15 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మైనార్టీలలో ఉన్న బీదరికం పోవాలంటే విద్య చాలా అవసరమని, చదువుకున్న కుటుంబాలు అన్ని రకాలుగా బాగుంటాయని, చదువుతోనే అన్నీ వస్తాయని, మైనార్టీలు వారి పిల్లల చదువుపై దృష్టి సారించాలని కోరారు.