ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ఎదురుగా ఉన్న సెంట్రల్ డివైడర్ మధ్యలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెట్లను నాటారు. ఈ సందర్భంగా మొక్కలకు పూజలు చేసి మమ్మల్ని చల్లగా చూడండి అంటూ వేడుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని, కొత్తగా ఇంటిని నిర్మించే వారు ఐదు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు అన్ని […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ఎదురుగా ఉన్న సెంట్రల్ డివైడర్ మధ్యలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెట్లను నాటారు. ఈ సందర్భంగా మొక్కలకు పూజలు చేసి మమ్మల్ని చల్లగా చూడండి అంటూ వేడుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని, కొత్తగా ఇంటిని నిర్మించే వారు ఐదు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. బతుకుదెరువు కోసం బొంబాయి.. దుబాయ్ వెళ్లడం కాదు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం బతుకుదెరువు కోసం పాలమూరుకు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె సి నరసింహులు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్. ఇంజనీర్ సుబ్రమణ్యం. టీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.