అవసరమైతే.. కేసీఆర్ కాళ్లు మొక్కుతాం : మంత్రి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వానిది పేగుబంధం. కొన్ని అపోహల కారణంగా సమస్యలు పరిష్కారం కాలేకపోయాయి. ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యతను మేము స్వీకరిస్తున్నాం.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వానిది పేగుబంధం. కొన్ని అపోహల కారణంగా సమస్యలు పరిష్కారం కాలేకపోయాయి. ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యతను మేము స్వీకరిస్తున్నాం.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి లక్షలాది మంది ఉద్యోగుల నోట్లో మన్ను కొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నమ్మొద్దని హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవిని గెలిపిస్తే మరింత ఉత్సాహంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి, అవసరమైతే కాళ్లు మొక్కి అయినా మీ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల కన్నా ఎక్కువగా, తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువగా ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అన్నారు. బీజేపీ నేతలు రకరకాల కుట్రలు చేసి ఎలాగైనా ఈ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలు ఏమాత్రం పొరపాటు చేసినా.. బీజేపీ అవకాశం ఇచ్చినట్టే అని సూచించారు. కులమతాలకతీతంగా అందరూ టీఆర్ఎస్‌కు అండగా నిలిచి వాణిదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రామచంద్ర రావు ఏమ్ ఉద్ధరించాడని ఎద్దేవా చేశారు. అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 50వేల ఉద్యోగాల కోసం ప్రాసెస్ జరుగుతోందని తెలిపారు.