కోనసీమగా మారిన పాలమూరు.. ఆనందంలో మంత్రి

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: కరువు కాటకాలతో, వలస బతుకులతో అల్లాడిన పాలమూరు జిల్లా ఇప్పుడు కోనసీమని తలపించేలా కళకళలాడుతోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని రాజమూర్ వాగుపై రూ. 4 కోట్ల 97 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులతో కలిసి […]

Update: 2021-07-20 07:56 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: కరువు కాటకాలతో, వలస బతుకులతో అల్లాడిన పాలమూరు జిల్లా ఇప్పుడు కోనసీమని తలపించేలా కళకళలాడుతోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని రాజమూర్ వాగుపై రూ. 4 కోట్ల 97 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి ఉత్సాహంగా పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కరువు, వలసల జిల్లా అని గుర్తింపు పొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు అందుబాటులోకి రావడంతో రైతులు సాగు చేస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు, ధాన్యపు రాశులు కనిపించే పరిస్థితులు నెలకొన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరానికి తాగునీరు అందిస్తామన్నారు.

Tags:    

Similar News