ప్రభుత్వాస్పత్రికి వెంటిలేటర్లు, మాస్కుల అందజేత
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న ముందస్తు జాగ్రత్తగా మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెంటిలేటర్లు, మాస్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం అందజేశారు. వీ-గార్డ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో పాలమూరు-ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2-వెంటిలేటర్లు, వెయ్యి N-95 మాస్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఐఎంఏ అధ్యక్షులు రామ్మోహన్ చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ కు అందజేశారు. వెంటిలేటర్స్, మాస్కులను అందచేసిన వీ-గార్డ్ ఇండస్ట్రీస్, వీ-గార్డ్ మేనేజర్ […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న ముందస్తు జాగ్రత్తగా మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెంటిలేటర్లు, మాస్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం అందజేశారు. వీ-గార్డ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో పాలమూరు-ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2-వెంటిలేటర్లు, వెయ్యి N-95 మాస్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఐఎంఏ అధ్యక్షులు రామ్మోహన్ చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ కు అందజేశారు. వెంటిలేటర్స్, మాస్కులను అందచేసిన వీ-గార్డ్ ఇండస్ట్రీస్, వీ-గార్డ్ మేనేజర్ బాబును మంత్రి అభినందించారు. అనంతరం ప్రభుత్పాస్పత్రిలో కరోనా రోగులకు డ్రై-ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.