చదువుకున్నవారితోనే అసలు సమస్య 

దిశ, మహబూబ్ నగర్:  కరోనా నియంత్రణలో చదువుకున్నవారి కంటే చదువుకోని వారే నయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణలో ఉన్నారని, అయితే పట్టణ ప్రజలు మాత్రం వివిధ కారణాలతో బయటకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 135 కోట్ల జనాభా ఉన్నమన దేశంలో ఇలాంటి వైపరిత్యాలను ఎదుర్కొవాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమంతా ప్రాణాలను పణంగా పెట్టి మీకోసం పని చేస్తున్నామని.. ప్రజలు అర్థం చేసుకోవాలని […]

Update: 2020-03-27 03:35 GMT

దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణలో చదువుకున్నవారి కంటే చదువుకోని వారే నయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణలో ఉన్నారని, అయితే పట్టణ ప్రజలు మాత్రం వివిధ కారణాలతో బయటకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 135 కోట్ల జనాభా ఉన్నమన దేశంలో ఇలాంటి వైపరిత్యాలను ఎదుర్కొవాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమంతా ప్రాణాలను పణంగా పెట్టి మీకోసం పని చేస్తున్నామని.. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కొంతమంది అధికారులు కేవలం ఆర్భాటాలకు పరిమితం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇలాంటి వారు తమ పద్ధతులు మార్చుకోవాలని ఆదేశించారు. కొంత మంది ఆకతాయిలు బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారని ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

tag;corona, minister, srinivas goud, ts news

Tags:    

Similar News