ఇల్లందులో ప్రతి ఎకరాకు నీరందాలి..

– ఇరిగేషన్ అధికారులతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష దిశ, న్యూస్‌బ్యూరో: ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, ప్రస్తుతం ఎన్ని ఎకరాలకు నీటి వసతి లేదో వెంటనే సర్వే చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఇల్లందు, మహబూబాబాద్ నియోజక వర్గాల్లోని ప్రతి ఎకరాకు నీరందించాలనే ఎజెండాతో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ […]

Update: 2020-05-09 07:28 GMT

– ఇరిగేషన్ అధికారులతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష
దిశ, న్యూస్‌బ్యూరో: ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, ప్రస్తుతం ఎన్ని ఎకరాలకు నీటి వసతి లేదో వెంటనే సర్వే చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఇల్లందు, మహబూబాబాద్ నియోజక వర్గాల్లోని ప్రతి ఎకరాకు నీరందించాలనే ఎజెండాతో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌తో కలిసి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో భూమి విస్తీర్ణం, నీటి లభ్యత సమాచారంతో పాటు ఆ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు గల మార్గాలు, వసతులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్ జిల్లాలో ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని, ఈ చెరువుల్లోని నీరు ప్రతి ఎకరాకు చేరే విధంగా ఓటీలు నిర్మించాలని చెప్పారు. ఈ రెండు నెలల్లోనే కాల్వల నిర్మాణం, మరమ్మత్తులు, ఓటీలు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించేలా పనులు ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకట కృష్ణ, ఎస్ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శంకర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News