ములుగు జిల్లాలో కరోనా కేసులు నిల్: మంత్రి సత్యవతి

దిశ, వరంగల్: ములుగు జిల్లాలో కరోనా కట్టడి కోసం జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కరోనా వైరస్ కట్టడి, వలస కార్మికులకు ప్రభుత్వ సాయం, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవ్వగా, వారూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయగా […]

Update: 2020-04-28 07:11 GMT

దిశ, వరంగల్: ములుగు జిల్లాలో కరోనా కట్టడి కోసం జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కరోనా వైరస్ కట్టడి, వలస కార్మికులకు ప్రభుత్వ సాయం, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవ్వగా, వారూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయగా నెగెటివ్ రావడం మంచి పరిణామన్నారు. ప్రస్తుతానికి ములుగు జిల్లాలో కరోనా కేసులు లేవని, ఇది చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఇకముందు జిల్లాలో కరోనా మహమ్మారి రాకుండా సమ్మక్క, సారలమ్మలు దయ చూడాలని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. కరోనా కట్టడి విషయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు షెల్టర్ కల్పించి భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు.

Tags : mulugu dist xero carona, minister satyavathi rathod, review meet on rice purchase

Tags:    

Similar News