ఖాళీ జాగా ఉంటే రూ.5 లక్షలు
దిశ, రంగారెడ్డి: ఖాళీ జాగా ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎల్.బీ. నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ ఎరుకల నాచారమ్మ బస్తీలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆత్మ గౌరవంతో జీవించాలనే సదుద్దేశంతో మరే రాష్ట్రంలో లేనివిధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తోందన్నారు. […]
దిశ, రంగారెడ్డి: ఖాళీ జాగా ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎల్.బీ. నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ ఎరుకల నాచారమ్మ బస్తీలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆత్మ గౌరవంతో జీవించాలనే సదుద్దేశంతో మరే రాష్ట్రంలో లేనివిధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తోందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు నేలగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నంపెట్టె అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్లేశం, కార్పొరేటర్లు సంగీత ప్రశాంత్ గౌడ్, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.