ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు : మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. బాలాపూర్, లెనిన్‌నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. సమీప చెరువల నుంచి కాలనీల్లోకి వరదనీరు చేరి, ఇళ్లన్నీ నీటమునిగాయి. దీంతో ఆదివారం స్థానిక మంత్రి సబితాఇంద్రారెడ్డి పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వరద బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెరువు కింద ఉన్న కాలనీలను ఖాళీ చేయించి.. పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ప్రజలెవరూ […]
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. బాలాపూర్, లెనిన్‌నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. సమీప చెరువల నుంచి కాలనీల్లోకి వరదనీరు చేరి, ఇళ్లన్నీ నీటమునిగాయి. దీంతో ఆదివారం స్థానిక మంత్రి సబితాఇంద్రారెడ్డి పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వరద బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెరువు కింద ఉన్న కాలనీలను ఖాళీ చేయించి.. పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు అని వెల్లడించారు.