గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దిశ, రంగారెడ్డి: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ముచ్చర్ల వరకు వేయనున్న ఫార్మా కంపెనీ రోడ్డుకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు పంట రుణాల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. రైతులు వాణిజ్య పంటలతో పాటు చిరుధాన్యాల సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో […]
దిశ, రంగారెడ్డి: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ముచ్చర్ల వరకు వేయనున్న ఫార్మా కంపెనీ రోడ్డుకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు పంట రుణాల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. రైతులు వాణిజ్య పంటలతో పాటు చిరుధాన్యాల సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.