డిగ్రీ, పీజీ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో డిగ్రీ, పీజీ, డిప్లొమో పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి సబిత మీడియాతో మాట్లాడుతూ.. కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్ జీవో 46ను అమలు చేయాలని తెలిపారు. జీవో ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. నెల వారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించుకోవాలని […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో డిగ్రీ, పీజీ, డిప్లొమో పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి సబిత మీడియాతో మాట్లాడుతూ.. కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్ జీవో 46ను అమలు చేయాలని తెలిపారు. జీవో ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. నెల వారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించుకోవాలని విద్యాసంస్థలను కోరినట్టు మంత్రి సబిత పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుగుతాయని వెల్లడించారు. జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు. టీసాట్, దూరదర్శన్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు.