క‌రోనా క‌ట్ట‌డిలో క‌లెక్ట‌ర్ ప‌నితీరు భేష్‌ : మంత్రి అజ‌య్‌

దిశ, ఖ‌మ్మం: క‌రోనా విజృంభిస్తున్న వేళ జాగ్ర‌త్త‌లు వ‌హించేలా మ‌రింత చైత‌న్యం పెంపొందించేలా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని మంత్రి అజ‌య్‌కుమార్ అన్నారు. బుధ‌వారం ఖ‌మ్మం జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో జిల్లా క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ ప‌నితీరును కొనియాడారు. వైరస్ కట్టడిలో కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నాడ‌ని తెలిపారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా అభినందించారు. అలాగే వాన‌కాలం పంటలు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతుబంధు వేదికల నిర్మాణం […]

Update: 2020-06-17 05:42 GMT

దిశ, ఖ‌మ్మం: క‌రోనా విజృంభిస్తున్న వేళ జాగ్ర‌త్త‌లు వ‌హించేలా మ‌రింత చైత‌న్యం పెంపొందించేలా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని మంత్రి అజ‌య్‌కుమార్ అన్నారు. బుధ‌వారం ఖ‌మ్మం జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో జిల్లా క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ ప‌నితీరును కొనియాడారు. వైరస్ కట్టడిలో కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నాడ‌ని తెలిపారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా అభినందించారు. అలాగే వాన‌కాలం పంటలు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతుబంధు వేదికల నిర్మాణం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అంత‌కుముందు భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లఅర్పించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ కురాకుల నాగభూషణం, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జెడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీలక్ష్మీ కుమారి, డీఎంహెచ్‌వో మాలతి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News