యాసంగిలో ఆ పంటలే వేయండి.. రైతులకు మంత్రి నిరంజన్ సూచన

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మార్క్ పేడ్ కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని, పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని కోరారు. మినుములకు కనీస మద్దతు ధర క్వింటాలుకు […]

Update: 2021-10-22 04:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మార్క్ పేడ్ కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని, పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని కోరారు.

మినుములకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 6,300గా ఉందన్నారు. మార్కెట్ ధర.. కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ను సంప్రదించిందన్నారు. గురువారమే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి లిఖితపూర్వకంగా మార్క్ ఫెడ్ హామీ ఇచ్చిందన్నారు.

మినుములతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీ పి.యాది రెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News