రైతు బజార్లలో రూ.35కు కేజీ ఉల్లి..
దిశ, తెలంగాణబ్యూరో : రాష్ట్రంలో ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ. 80 నుంచి రూ. 100కు దొరుకుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోని రైతు బజార్లలో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. శనివారం నుంచే ఉల్లి విక్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జంట నగరాల్లోని […]
దిశ, తెలంగాణబ్యూరో : రాష్ట్రంలో ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ. 80 నుంచి రూ. 100కు దొరుకుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోని రైతు బజార్లలో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు.
శనివారం నుంచే ఉల్లి విక్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జంట నగరాల్లోని మొత్తం 11 రైతుబజార్లలో ఉల్లి విక్రయం జరుగుతుందని తెలిపారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తామని, ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిని కొనుగోలు చేయొచ్చన్నారు. భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిన్నదని, లాభం లేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరుపుతున్నామని వెల్లడించారు.