రైతుల మేలుకోసమే కొత్త వ్యవసాయ విధానం
దిశ, న్యూస్‌బ్యూరో: దశాబ్దాలుగా దగాపడ్డ రైతులు తెలంగాణ రాష్ట్రంలో దైర్యంగా వ్యవసాయం చేస్తున్నారని, రైతుల మేలు కోసమే కొత్త వ్యవసాయ విధానానికి సీఎం కేసీఆర్ ప్రణాళిక చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటి కావాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని, వారు ఆశించేస్థాయి నుండి శాసించే స్థాయికి చేరాలన్నారు. రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను […]
దిశ, న్యూస్‌బ్యూరో: దశాబ్దాలుగా దగాపడ్డ రైతులు తెలంగాణ రాష్ట్రంలో దైర్యంగా వ్యవసాయం చేస్తున్నారని, రైతుల మేలు కోసమే కొత్త వ్యవసాయ విధానానికి సీఎం కేసీఆర్ ప్రణాళిక చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటి కావాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని, వారు ఆశించేస్థాయి నుండి శాసించే స్థాయికి చేరాలన్నారు. రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సోనా మూలంగా మధుమేహులకు కలిగే ఉపయోగాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించేలా ప్రచారం చేయాలని, వానాకాలంలో వేసే ప్రతి పంటా రికార్డ్ కావాలన్నారు. నేలల వర్గీకరణ చేయాలని, ఆయా నేలల్లో పండే అనుకూలమైన పంటలను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ కేశవులు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.