వ్యాక్సిన్ ద్వారానే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట : మంత్రి నిరంజన్ రెడ్డి

దిశ, వనపర్తి: ఫ్రంట్ లైన్‌ వారియర్లందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం మూలంగా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సూపర్ స్పైడర్‌లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా అరికట్టే చర్యలలో భాగంగా పాత్రికేయులు, వంటగ్యాస్ కార్మికులు,పెట్రోల్ బంక్‌లలో పనిచేసే కార్మికులు, చౌక ధరల దుకాణాల […]

Update: 2021-05-28 04:48 GMT

దిశ, వనపర్తి: ఫ్రంట్ లైన్‌ వారియర్లందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం మూలంగా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సూపర్ స్పైడర్‌లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా అరికట్టే చర్యలలో భాగంగా పాత్రికేయులు, వంటగ్యాస్ కార్మికులు,పెట్రోల్ బంక్‌లలో పనిచేసే కార్మికులు, చౌక ధరల దుకాణాల డీలర్లు, హమాలీలు, పెస్టిసైడ్స్ & ఫర్టిలైజర్ కార్మికులు వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల కరోనాను నివారించవచ్చునన్నారు.

ప్రభుత్వం సూపర్ స్పైడర్‌గా పిలువబడే జిల్లాలోని 2250 మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజులు సాగే ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్ వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ… వనపర్తి జిల్లాలో సూపర్ స్పైడర్‌లుగా 2 వేల మందిని గుర్తించామని వారికి రెండు రోజులపాటు వ్యాక్సిన్ వేయడానికి వైద్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అమరేందర్, తహసీల్దార్ రాజేందర్ గౌడ్, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, డీపీఆర్వో రషీద్, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:    

Similar News