ఆయన స్టైలే వేరు.. మరోసారి ప్రత్యేకత చాటుకున్న తెలంగాణ మంత్రి (వీడియో)
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/వనపర్తి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన నియోజకవర్గ కేంద్రమైన వనపర్తిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం అల్పాహారాన్ని ఏర్పాటుచేసి కార్యక్రమానికి హాజరైన వారితో కలిసి టిఫిన్ చేసి, అందరినీ ఆనందింపజేశారు. గతంలోనూ ఇదేమాదిరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేయడంతో పాటు భారీ ఎత్తున విందు భోజనాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఉత్సాహాన్ని […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/వనపర్తి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన నియోజకవర్గ కేంద్రమైన వనపర్తిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం అల్పాహారాన్ని ఏర్పాటుచేసి కార్యక్రమానికి హాజరైన వారితో కలిసి టిఫిన్ చేసి, అందరినీ ఆనందింపజేశారు. గతంలోనూ ఇదేమాదిరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేయడంతో పాటు భారీ ఎత్తున విందు భోజనాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఉత్సాహాన్ని కలిగించిన మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం సైతం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేలా కార్యక్రమాలను నిర్వహించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయా మండలాల నుండి తరలివచ్చిన 247 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులతోపాటు మరో 87 మంది సీఎం సహాయనిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి వంటి పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని చెప్పారు. ఈ ప్రభుత్వం మనది. మన అందరిదీ అన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి లబ్ధిదారులతో కలిసి అల్పాహారం చేశారు. మంత్రి వారితో కలిసి అల్పాహారం చేయడంతో లబ్ధిదారుల ఆనందాలకు అవధుల్లెకుండా పోయాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.