ఇది రైతు బడ్జెట్: నిరంజన్ రెడ్డి
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ సీఎం కేసీఆర్ ఆశయం, ఆకాంక్ష, చిత్తశుద్ధికి అద్దం పడుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయిందన్నారు. ఆదివారం తెలంగాణ బడ్డెట్ కేటాయింపులపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బడ్జెట్‌లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరమని మంత్రి చెప్పారు. రైతుబంధు పథకం కింద లబ్ధిదారులు పెరిగిన నేపథ్యంలో.. గతంలో కేటాయించిన రూ.12 వేల కోట్లకు అదనంగా 2 వేల కోట్లు […]
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ సీఎం కేసీఆర్ ఆశయం, ఆకాంక్ష, చిత్తశుద్ధికి అద్దం పడుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయిందన్నారు. ఆదివారం తెలంగాణ బడ్డెట్ కేటాయింపులపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బడ్జెట్‌లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరమని మంత్రి చెప్పారు. రైతుబంధు పథకం కింద లబ్ధిదారులు పెరిగిన నేపథ్యంలో.. గతంలో కేటాయించిన రూ.12 వేల కోట్లకు అదనంగా 2 వేల కోట్లు పెంచి రూ.14 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని కొనియాడారు. రైతు భీమా పథకానికి రూ.1141 కోట్లు, రైతుల రుణాల మాఫీకోసం రూ. 6,225 కోట్లు కేటాయించామని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించేందుకు పంటల కొనుగోళ్ల కోసం (మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్) రూ.1000 కోట్లు కేటాయించడం సాహసోపైతమయిన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల కష్టానికి ఫలితం దక్కాలన్న ప్రభుత్వ ఆలోచనకు ఇది అద్దం పట్టేలా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
tag: niranjan reddy, assembly, budget