మంత్రి నిజాయితీ నిరూపించుకోవాలి: కాంగ్రెస్
దిశ ప్రతినిధి, మేడ్చల్:మూడు చింతలపల్లి దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్షలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అవినీతి అక్రమాలపై చేసిన ఆరోపణలపై వెంటనే ఐఏఎస్‌ల కమిటీ వేసి నిజాయితీని నిరూపించుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కో ఆర్డినేటర్లు తోటకూర జంగయ్య యాదవ్, హరివర్ధన్‌రెడ్డి లతో కలిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మేడ్చల్ జిల్లా […]
దిశ ప్రతినిధి, మేడ్చల్:మూడు చింతలపల్లి దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్షలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అవినీతి అక్రమాలపై చేసిన ఆరోపణలపై వెంటనే ఐఏఎస్‌ల కమిటీ వేసి నిజాయితీని నిరూపించుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కో ఆర్డినేటర్లు తోటకూర జంగయ్య యాదవ్, హరివర్ధన్‌రెడ్డి లతో కలిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు.
మల్లారెడ్డి నీతి, నిజాయితీ పరుడు అయితే నిజాయితీ రుజువు చేసుకోవాలన్నారు. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీల భూములపై, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన కాలేజీ భూములపై, జవహర్ నగర్‌లో కోడలిపై అక్రమ రిజిస్ట్రేషన్‌తో నిర్మాణం చేసిన హాస్పిటల్ సంబంధించిన భూమిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జవహర్‌నగర్ రెడ్ మార్క్‌లోని ప్రభుత్వ భూమిని మంత్రి ఆక్రమించుకున్నారనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జవహర్‌నగర్ ప్రభుత్వ భూమి లో నిర్మించిన ఆసుపత్రికి సంబంధించిన నోటరీ, రిజిస్ట్రేషన్ సంగతీ తేలుస్తామని చెప్పారు.
రేవంత్‌రెడ్డి చేసినటువంటి ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. మంత్రిగా నీ నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలు తప్పు అని, నిరూపిస్తే ఎలాంటి సవాలుకైనా సిద్ధమని ప్రకటించారు. మీకు చేతనైతే నీవు కట్టుబడి ఉండు… శామీర్‌పేట మండలంలోని దేవరయంజాల్ భూములపై మాజీ మంత్రి రాజేందర్‌పై ఆరోపణలు వస్తే వెంటనే ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఆయనను దోషిగా నిలబెట్టి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు కదా… రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు.. మీరు ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నారు కదా.. వెంటనే మీ ప్రభుత్వానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి విచారణ చేయించి, నాది సక్రమమే.. అక్రమం కాదు, అని నిరూపించుకొని ప్రజలకు వివరించాలన్నారు. నీ నిజాయితీని నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ప్రజా క్షేత్రంలో నిలవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోందన్నారు.