మంత్రి మల్లారెడ్డికి షాక్.. ఐదేళ్లు కాలేజీ బ్యాన్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) షాక్ ఇచ్చింది. కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై ఏకంగా ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాక్ అధికారిక వెబ్‌సెట్ ద్వారా శుక్రవారం ప్రకటించింది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో బి++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. ఐతే ఇంకా మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) షాక్ ఇచ్చింది. కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై ఏకంగా ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాక్ అధికారిక వెబ్‌సెట్ ద్వారా శుక్రవారం ప్రకటించింది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో బి++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. ఐతే ఇంకా మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నిం చేసిందని తెలిపింది. న్యాక్ బెంగళూర్‌కు సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌లో నకిలీ డాక్యూమెంట్లను పంపించారు. న్యాక్ కౌన్సిల్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. దీని ద్వారా మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం ఛీటింగ్‌కు పాల్పడిందంటూ ఆ కాలేజీపై చర్యలకు ఉపక్రమించింది. అక్రిడేషన్ విషయంలో ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యా బుద్దులు చెప్పే ప్రొఫెసర్లు, అధ్యాపకులు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించడం విడ్డూరంగా ఉంది. తన 20 ఏండ్ల కాలేజీ మేనేజ్మెంట్అనుభవంలో ఇలాంటి సందర్భాన్ని ఎప్పుడూ చూడలేదని, దేశంలో ఎక్కడా చోటు చేసుకోలేదని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఎండీ అభిప్రాయపడ్డారు.
ఐతే కాలేజీకి న్యాక్ బృందం వస్తుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో ప్రొఫెసర్లు, సీనియర్ ప్రిన్సిపల్, ఐఏఎస్ అధికారి కూడా ఉంటారు. అలాంటి బృందం డాక్యుమెంట్లను ఎందుకు పరిశీలించలేదన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం, దర్యాప్తు చేస్తే మిగతా అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ఓ ఇంటర్ కాలేజీకి అనుమతి ఇచ్చేందుకే సవాలక్ష ఆంక్షలు పెడతారు. అలాంటి పరిస్థితుల్లో న్యాక్ అక్రిడేషన్ ఇచ్చేందుకు ఎంత కసరత్తు చేస్తుందో అంచనా వేయొచ్చు. రాష్ట్రంలో ఇలాంటి కేసు మొదటిది కావడంతో పెద్ద దుమారం రేగింది. విద్యావంతుల్లో చర్చకు దారి తీసింది. మంత్రి మల్లారెడ్డికి పలు విద్యా సంస్థలతోనే గుర్తింపు లభించింది. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలోనే ఆయన తన విద్యా సంస్థలను మల్లారెడ్డి మహిళా యూనివర్సిటీకి ఆమోదం లభించింది. ఐదు ప్రైవేటు యూనివర్సిటీల్లో మంత్రి యూనివర్సిటీ ఒకటి కావడం విశేషం. యూనివర్సిటీ మేడ్చల్ మైసమ్మగూడలో ఉంది. తాజా పరిణామాలతో మిగతా ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తోన్న వారి కళాశాలకు పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. ప్రచారం కూడా జోరుగా చేసుకోవడం పరిపాటి. ఈ క్రమంలో మిగతా కళాశాలల్లో ఏయే లోపాలను న్యాక్ గుర్తించిందన్న అంశంపై చర్చ నడుస్తోంది.