అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి..

దిశ, కీసర: మున్సిపాలిటీలలోని ప్రతి కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 17వ వార్డులో కాలనీ వాసుల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్ పార్కు, సీసీ కెమెరాలు, కౌన్సిలర్ మోర మౌనిక నరహరి రెడ్డి స్వంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి నిరుపేదలను […]

Update: 2021-10-24 09:04 GMT

దిశ, కీసర: మున్సిపాలిటీలలోని ప్రతి కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 17వ వార్డులో కాలనీ వాసుల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్ పార్కు, సీసీ కెమెరాలు, కౌన్సిలర్ మోర మౌనిక నరహరి రెడ్డి స్వంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి నిరుపేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.

సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్ స్వామి, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపనబోలు హరి గౌడ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News