భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసే అపూర్వ ఘట్టం.. బొగ్గు బ్లాక్ ప్రారంభంపై రేవంత్ రెడ్డి
ఇది భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసే అపూర్వ ఘట్టమని, సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇది భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసే అపూర్వ ఘట్టమని, సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఒడిశా రాష్ట్రం (Odisha State)లో సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్ (Singareni Nainee Coal Block) గనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
\దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి (Telangana Singareni), రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు. అలాగే సింగరేణి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వల్లే తొలిసారి దేశంలోని ఇతర రాష్ట్రంలోనూ బొగ్గు గనిని ప్రారంభించడం సాధ్యమైందని, ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని నైనీ గని ప్రారంభించడం ద్వారా సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో వెల్లడించారు.
నైనీ బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించిన చారిత్రక ఘట్టం సాకారం కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇక తెలంగాణకు మణిమకుటంగా, వేలాది కార్మిక కుటుంబాలకు జీవనాధానంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ధికి, విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.